ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలోని శివాలయాల్లో సందడి

కార్తిక మాసం నాలుగో సోమవారం వేళ పశ్చిమగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ప్రసిద్ధ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. పెద్ద ఎత్తున కార్తిక దీపాలు వెలిగించి... మహిళలు పూజలు నిర్వహించారు.

By

Published : Dec 7, 2020, 9:41 AM IST

Updated : Dec 7, 2020, 11:39 AM IST

women  lit the kartheeka depamam at west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో ఆలయాల్లో శివనామస్మరణం

  • ఉండ్రాజవరం

జిల్లాలోని ఉండ్రాజవరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన గోకర్ణేశ్వరస్వామి స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు చేస్తున్నారు. 11వ శతాబ్దం రాజరాజనరేంద్రుని కాలం నుంచి ఈ ఆలయం ఉందని స్థానికులు తెలిపారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా దేవస్థాన పాలకవర్గం అధికారులు భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశారు.

  • పాలంగి

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి అభిషేకాలు చేశారు. రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సీతాదేవి ఇసుకతో లింగాకృతి తయారు చేయగా శ్రీరాముడు పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించాడని పురాణ కథనం. మహిళలు ధ్వజస్తంభానికి పూజలు చేసి.. అరటి దొప్పలపై వెలిగించిన దీపాలను దేవాలయం పక్కనే ఉన్న కోనేటిలో వదిలారు. కోవిడ్ కారణంగా దేవస్థానం అధికారులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  • తణుకు

జిల్లాలో తణుకు పాత ఊరులోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున్న స్వామివారికి పాలాభిషేకాలు చేసి... మొక్కులు చెల్లించుకున్నారు. కార్తిక మాసం పర్వదినాలలో సోమవారం రోజున పౌర్ణమి వేళ స్వామివారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

  • సజ్జాపురం

తణుకు సజ్జాపురంలోని సోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. సోమేశ్వర స్వామి ఆలయానికి త్రేతాయుగంతో చరిత్రతో సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. విభీషణుడు పవిత్ర గోస్తనీ నది తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణంలో ఉందని వారన్నారు. ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. పాలాభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తిక మాసం పర్వదినాలలో భోళాశంకరుని దర్శించుకుంటే అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

  • సోమారామం

భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమారామానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం 4వ సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. మాస్కు ధరించిన వారిని మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు. ఇక్కడి స్వామివారిని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని స్థానికులు తెలిపారు. స్వామివారు పౌర్ణమికి తెలుపు వర్ణంలోనూ.. అమావాస్యకు గోధుమవర్ణం ,నల్లపు మచ్చలతో భక్తులకు దర్శనమిస్తూ వుంటాడని భక్తులు చెబుతున్నారు.

ఇదీ చూడండి.

చక్రవర్తుల ఆహారం.. ఆరోగ్యానికి సోపానం

Last Updated : Dec 7, 2020, 11:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details