ఆమె ఆలోచన..నలుగురికి ఉపాధి - పశ్చిమగోదావరి జిల్లా
స్వశక్తితో ఎదగాలనే ఆమె తపన మరో నలుగురికి ఉపాధి కల్పించింది. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే ఇరుగుపొరుగు యువతులను తన అక్కున చేర్చుకుని...విస్తర్ల తయారీ మెళకువలు నేర్పి వారికి ఆదాయ మార్గాన్ని చూపుతోంది పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అంబిక మందిరం సెల్వకుమారి.
ఇంటి వద్దనే ఉంటూ ఉపాధి పొందాలనే మహిళ చేసిన ఆలోచన మరో నలుగురికి దారి చూపించింది. పశ్చిమగోదావరి జిల్లా రాఘవాపురం గ్రామానికి చెందిన అంబిక మందిరం సెల్వ కుమారి విస్తర్లు తయారీ పరిశ్రమ ద్వారా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. కేరళకు చెందిన ఈమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత దెందులూరు మండలం వేగవరంలోని సెయింట్ డామియన్ కుష్టు వ్యాధి నివారణ కేంద్రంలో సుమారు 30 సంవత్సరాలపాటు సేవలందించారు.తదుపరి సుమారు 4 లక్షల వ్యయంతో విస్తర్లు తయారుచేసేపరిశ్రమను నెలకొల్పారు. దీని ద్వారా చుట్టుపక్కల చదువుకున్న మహిళలకు ఉపాధి కల్పించారు. ప్రస్తుతం అంతా కలిసి సమష్ఠిగాపనిచేస్తూ ఉపాధిని పొందుతున్నారు.