ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్సిల్ లిడ్​తో 120 లింకులు.. గిన్నీస్ బుక్​లో గోదావరి కుర్రాడికి స్థానం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొండవీటి కొడపకు చెందిన కొండవీటి దుర్గాప్రసాద్ సూక్ష్మ చిత్ర కళలో గిన్నీస్ రికార్డు సాధించారు. పెన్సిల్ లిడ్​తో 120 లింకులు తయారుచేసి ఈ రికార్డు అందుకున్నాడు.

By

Published : Jul 9, 2020, 8:40 PM IST

west godavari young person got place in  gunnis record
గిన్నీస్ బుక్​లో స్థానం పొందిన గోదావరి కుర్రాడు

పశ్చిమగోదావరి జిల్లా కొండవీటి కడపకు చెందిన కొండవీటి నాగశివచంద్రరావు, ఊర్మిల దంపతుల కుమారుడు దుర్గా ప్రసాద్. ప్రస్తుతం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు హోటల్ నిర్వహిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు డిప్లొమా పూర్తవగానే బెంగళూరులో కొంతకాలం ఉద్యోగం చేశాడు.

ఆ సమయంలో సూక్ష్మ చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో పెన్సిల్ ముల్లుతో ఆకృతులు తయారుచేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు సుమారు 200లకుపైగా కళాఖండాలు తయారుచేశాడు. వాటిలో తాజ్ మహల్, చార్మినార్, బలిదాన్ తదితర చిత్రాలు ఉన్నాయి.

తాజాగా 120 లింకులు తయారుచేసి గిన్నీస్ రికార్డులో తన పేరు లిఖించుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు చెక్కి అవార్డులు సాధించటంతోపాటు.. భారత రక్షణ రంగంలో ఉద్యోగం సాధించి దేశ సేవ చేయడమే తన లక్ష్యమని దుర్గాప్రసాద్ తెలిపారు.

ఇవీ చదవండి...

భీమవరం డ్రగ్స్ రాకెట్​ కేసు... మరో నలుగురు అరెస్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details