పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏలూరులోని కత్తేపువీధి, చిరంజీవి బస్ స్టాప్ సెంటర్, పాలతూము సెంటర్, కొత్తూరు నుంచి సుమారు 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని డిపో నుంచి కొందరు దళారులు సేకరించి తణుకు తీసుకెళ్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు సిబ్బంది, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు.అక్రమంగా తరలిస్తున్న 180 బస్తాల రేషన్ బియ్యం గుర్తించారు. రేషన్ బియ్యాన్ని, లారీని సీజ్ చేశారు. లారీ డ్రైవర్ పైన బియ్యం తరలిస్తున్న అతని యజమాని పైన కేసు నమోదు చేశారు.
విజిలెన్స్ దాడుల్లో రేషన్ బియ్యం పట్టివేత - case
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విజలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
రేషన్ బియ్యం