ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బు ఇవ్వలేదని..ఆశ్లీల వీడియోలు పోస్ట్ చేసేశాడు! - మెుగల్తూరు

తప్పు చేసింది ఒకరు. ఆ తప్పును నలుగురికి తెలిసేలా చేసింది మరొకరు. వెరసీ ఓ యువతి జీవితంతో ఆడుకున్నారు ఇద్దరు ప్రబుద్ధులు. ఆశ్లీల వీడియోలు తీసి ఓ అమ్మాయి జీవితాన్ని డబ్బుల కోసం నాశనం చేసేశారు.

unseen_videos_post_in_social_media

By

Published : Jul 2, 2019, 12:29 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా మెుగల్తూరులో ఓ వ్యక్తి ఆశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. మెుబైల్ సర్వీసింగ్ సెంటర్​ నడుపుతున్న వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఆ వీడియోలు చేరాయి. ఎప్పుడు ఎవరు దొరికితే డబ్బులు లాగుదామా అనే ఆలోచనలో ఉన్న రెండో యువకుడు మెుదటి యువకుడికి ఫోన్ చేశాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే.. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. చివరకు అన్నంత పని చేసేశాడు. ఈ విషయం యువతికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించి వదిలేశారంతే.

ABOUT THE AUTHOR

...view details