పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ స్థల వివాదం... రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేసింది. పట్టణంలోని 21 డివిజన్ లో మునిస్వామి అనే మాజీ సైనికునికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ నాయకుడు కబ్జా చేసి కొంతమందికి ప్లాట్లుగా విడగొట్టి అమ్మేశాడని ఓ వర్గం వారు ఆరోపించారు. స్థలాన్ని కొన్న కొందరు వ్యక్తులు ఇల్లు కట్టేందుకు ప్రయత్నం చేయగా మరో వర్గం వారు కట్టడాలను అడ్డుకోగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను వారించి ఘటనపై కేసు నమోదు చేశారు.
ఘర్షణకు దారి తీసిన స్థల వివాదం - fight...because of land issue
ఓ స్థల వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణను రేకెత్తించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘర్షణకు దారితీసిన స్థల వివాదం