ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారుపై కూలిన చెట్టు... వాహనదారులు సురక్షితం

ఉంగుటూరు దగ్గర జాతీయ రహదారిపై కారులో వెళుతున్న దంపతులకు ప్రాణాపాయం తప్పింది. హఠాత్తుగా కారుపై చెట్టు పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

tree falls on car in national highway at unguturu
ప్రయాణికులు సురక్షితం

By

Published : May 12, 2020, 12:49 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి బెంగళూరు వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా చెట్టు పడింది. కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.

బొబ్బిలికి చెందిన మేడి శ్రీనివాస్, భార్య గాయత్రి, కుమార్తె హర్షికలతో పాటు శ్రీనివాస్ సోదరుడు రామకృష్ణ కారులో ప్రయాణిస్తున్నారు. చెట్టుకొమ్మ కారు అద్దాలను ధ్వంసం చేసి.. లోపలికి వెళ్లి.. అందులో ఉన్న వారిని గాయపరిచింది. బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details