ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో: ముగ్గురికి గాయాలు - జీలుగుమిల్లి రోడ్డు ప్రమాద వార్తలు

ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

raod accident
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురికి తీవ్ర గాయాలు

By

Published : Jan 28, 2021, 5:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం శివారులో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేటకు చెందిన నలుగురు జీవనోపాధికి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్​కు ఆటోలో వెళ్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం సరిహద్దు వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ అనే వ్యక్తి ఎడమ కాలు విరిగిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details