పశ్చిమగోదావరిజిల్లా పెరవలి మండలం కాకరపర్రు వద్ద గోదావరిలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు కాకరపర్రు గోదావరి ఒడ్డుకు విహారానికి వెళ్లారు. కొంతసేపు తర్వాత గోదావరినదిలో ఇటు నుంచి అటు నడిచి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ముగ్గురు యువకులు మునిగిపోయారు. నవీన్‌కుమార్‌అనే యువకుడు మాత్రం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విజ్జు సాయికిరణ్, మిర్యాల వంశీ, ముత్యాల మణికంఠ మృతులుగా గుర్తించారు.. గోదావరిలోతును గమనించకుండా వీరు వెళ్లి రావటం వల్ల ప్రమాదవశాత్తు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు.
గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాలు - godavari
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకపర్రులో వద్ద గోదవరి ఒడ్డుకు ముగ్గురు యువకులు విహారానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాలు