పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని గణపవరం పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం గ్రామానికి చెందిన వెంపల చంటి.. చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసై 2008 నుంచి దొంగతనలు మొదలుపెట్టాడు. పశ్చిమగోదావరి జిల్లాతో పాటు కృష్ణా, ప్రకాశం, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో దొంగతనాలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు.
నిందితునిపై సుమారు 73 దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించామన్నారు. జిల్లాలోని గణపవరం పోలీసు స్టేషన్ పరిధిలో సప్పాలక్ష్మి అనే మహిళ ఇంట్లో 43 ½ కాసుల బంగారం, 3 తులాల వెండి, దొంగిలించినట్లు బాధితురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.