ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వయ్యేరు కాలువకు వరద ఉద్ధృతి... నీట మునిగిన ఇళ్లు - పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని వయ్యేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా తణుకు మండలంలోని దువ్వ ముద్దాపురం వద్ద కొందరి నివాస గృహాలు నీటమునిగాయి.

The Vayeru canal in West Godavari district flows as an excerpt for the incessant rains.
వయ్యేరు కాలువ ఉద్ధృతి

By

Published : Sep 15, 2020, 12:23 PM IST

గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా.... ఆ ప్రభావం అనుసంధానంగా ఉన్న కాలువలపై పడింది. ఎర్ర కాలువ ఉద్ధృతితో తణుకు మండలం దువ్వ ముద్దాపురం మీదుగా వెళ్లే వయ్యేరు కాలువకు ప్రవాహం పెరిగింది. పక్కనే ఉన్న నివాస గృహాలు, గుడిసెలు నీట మునిగాయి.

43 కుటుంబాలకు చెందిన సుమారు 150 మందిని రెవెన్యూ అధికారులు సమీపంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. బాధితులకు వసతితో పాటు భోజన సదుపాయాలు కల్పించారు. అధికారులు వసతి ఏర్పాటు చేసినప్పటికీ బాధిత కుటుంబీకులు సామగ్రి పోతుందనే భయంతో కాలవ గట్టు పైభాగంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details