ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్దుకుంటున్న పల్లెలు.. పునరావాస కాలనీలకు పయనం

పోలవరం ప్రాజెక్ట్ పునరావాసంపై మూడు నెలలుగా అనేక ముహూర్తాలు ప్రకటించారు. అయినా ఒక్క అడుగూ ముందుకుపడని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ స్వయంగా పునరావాస పరిస్థితులపై నిర్వహించిన సమీక్ష నిర్వాసితులకు ఆనందం కలిగించింది. వరదలు వచ్చేలోగా 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించాలని సీఎస్‌ ఆదేశించడంతో నిర్వాసితులకు నమ్మకం ఏర్పడింది.

సర్దుకుంటున్న పల్లెలు.. పునరావాస కాలనీలకు పయనం
సర్దుకుంటున్న పల్లెలు.. పునరావాస కాలనీలకు పయనం

By

Published : May 20, 2021, 7:31 PM IST

తాడ్వాయిలో నిర్మితమవుతున్న పునరావాస కాలనీ

సర్దుకుంటున్న పల్లెలు.. పునరావాస కాలనీలకు పయనం

పోలవరం పునరావాసంపై నిర్వాసితులకు నమ్మకం ఏర్పడింది. మూడు నెలలుగా అనేక ముహూర్తాలు ప్రకటించినా ఒక్క అడుగూ ముందుకుపడని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ స్వయంగా పునరావాస పరిస్థితులపై సమీక్ష నిర్వహించడం నిర్వాసితులకు ఆనందం కలిగించింది. వరదలు వచ్చేలోగా 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించాలని సీఎస్‌ ఆదేశించారు. గోదావరి నదికి వరదలు వచ్చేలోగా జిల్లాలోని 44 గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా గ్రామాలకు చెందిన 10,389 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించే ఏర్పాట్లు చేపడుతోంది. జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల నిర్వాసితులు పెట్టేబేడ సర్దుకుని పునరావాసానికి తరలేందుకు సిద్ధం కావాలంటూ అధికార యంత్రాంగం ఇప్పటికే సంకేతాలిచ్చింది.

కాఫర్ డ్యామ్ కారణంగా..

పోలవరం ప్రాజెక్టులో అనుబంధ నిర్మాణంగా ఉన్న కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ఈ ఏడాది 41.15 కాంటూరు స్థాయిలో నీరు నిల్వ ఉండే సూచనలు ఉండటంతో ఆ స్థాయిలో ముంపునకు గురయ్యే గ్రామాలను ఈ నెలాఖరులోగా ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. కుక్కునూరు మండలంలోని గిరిజన నిర్వాసితులను అదే మండలంలో నిర్మిస్తున్న కాలనీల్లో సర్దుబాటు చేస్తుండగా, వేలేరుపాడు మండలంలోని నిర్వాసితులను జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో నిర్మించే కాలనీలకు తరలిస్తున్నారు. పోలవరం మండలంలోని గిరిజన నిర్వాసితులను పోలవరం, గోపాలపురం మండలాల్లో నిర్మించే కాలనీలకు తరలిస్తున్నారు.

పరిహారం చెల్లించేందుకు కొలతలు తీస్తున్న సిబ్బంది

సర్దుకుంటున్న పల్లెలు.. పునరావాస కాలనీలకు పయనం

పోలవరం పునారావాసంలో తాడ్వాయి కాలనీది ఒక ప్రత్యేకత. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని గిరిజనేతర జనాభా అంతటికీ ఇక్కడే కాలనీ నిర్మిస్తున్నారు. దాదాపు 20 వేలకు పైగా కుటుంబాలకు ఇక్కడ పునరావాసం చూపబోతున్నారు. దాదాపు 80 వేల జనాభా నివసించే ఈ కాలనీ నిర్మాణం నత్తనడక నడుస్తోంది. 41.15 కాంటూరు పరిధిలోనే దాదాపు ఐదు వేలకు పైగా గిరిజనేతర జనాభాను ఈ కాలనీకి తరలించాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. ఇదో ప్రతిష్ఠాత్మక పునరావాసం కావడంతో ఇక్కడి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని నియమించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. పోలవరం పునరావాసం పూర్తి కావాలంటే ఈ కాలనీ నిర్మాణ పనులు పూర్తికావాల్సి ఉంది. అందుకే కాలనీ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

ఎల్‌ఎన్‌డీపేట పునరావాస కాలనీలో ప్రాజెక్టు నిర్వాసితులు

సర్దుకుంటున్న పల్లెలు.. పునరావాస కాలనీలకు పయనం

పోలవరం మండలంలోని ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులు పునరావాస కాలనీల బాటపడుతున్నారు. వాడపల్లి గ్రామానికి చెందిన 70 గిరిజన కుటుంబాలకు మండల పరిధిలోని ఎల్‌ఎన్‌డీపేట వద్ద నిర్మించిన కాలనీలో పునరావాసం కల్పించారు. బుధవారం వారంతా ఆటోల్లో పునరావాసకాలనీకి వెళ్లి వారికి కేటాయించిన ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. గోదావరికి వరదలు వస్తే ముంపు గ్రామాల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడతామని, వరద ఏ స్థాయిలో వస్తోందో తెలియదని, ఇలాంటి పరిస్థితుల్లో ముంపు గ్రామాల్లో ఉండటం శ్రేయస్కరం కాదని నిర్వాసితులు చెబుతున్నారు. జూన్‌ నాటికి తరలిస్తామని చెబుతున్న అధికారులు తమకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాంకు ఖాతాలకు జమచేస్తే అంతకంటే ముందుగానే వెళ్లిపోతామంటున్నారు. ఈ నెల 22వ తేదీన మంచిరోజు కావడంతో పాలు పొంగిస్తున్నామని, నెమ్మదిగా సామాన్లు తరలిస్తామని, అధికారులు సత్వరం ప్యాకేజీ అందజేయాలని వారు కోరుతున్నారు.

సర్దుకుంటున్న పల్లెలు.. పునరావాస కాలనీలకు పయనం

ఇవీ చూడండి :మాస్క్ పెట్టుకోకుండా ఏం మెసేజ్ ఇస్తున్నారు..?: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details