ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంబేడ్కర్​ రాజ్యాంగానికి తెదేపా తూట్లు పొడిచింది..!' - శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యాఖ్యలు

మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు తీరు బాధాకరమన్నారు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు. రాష్ట్ర అభివృద్ధిని తెదేపా అడ్డుకుంటుందని విమర్శించారు.

thanuku-mla-kaarumuri-venkata-nageswararao-comments
శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యాాఖ్యలు

By

Published : Jan 26, 2020, 10:59 AM IST

తెదేపాపై వైకాపా ఎమ్మెల్యే విమర్శలు

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లుల రద్దు విషయంలో శాసనమండలిలో తెదేపా ఎమ్మెల్సీల తీరు బాధాకరమని పశ్చిమగోదావరిజిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగానికి తెదేపా తూట్లు పొడిచిందని విమర్శించారు. బిల్లులపై చర్చించి మోషన్‌మూవ్‌ అయిన తరుణంలో ఎలాంటి లేఖలు ఇవ్వకుండా ఛైర్మన్​ సెలక్ట్‌ కమిటీకి పంపడాన్ని తప్పుబట్టారు.

ABOUT THE AUTHOR

...view details