ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్గదర్శిలో సోదాలకు అనుమతి లేదు: తెలంగాణ హైకోర్టు

No Permision For Rides In Margadarsi Head Office: హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రధాన కార్యాలయంలో.. సోదాలు ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన.. వారంట్ అమలును నిలిపివేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి చందాదారుల వివరాలను కోరారని, ఇది వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని.. అందువల్ల సోదాలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై తదుపరి పరిశీలన నిమిత్తం విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

Margadarsi Chit Funds
మార్గదర్శి చిట్ ఫండ్

By

Published : Dec 17, 2022, 7:36 AM IST

Updated : Dec 17, 2022, 1:06 PM IST

No Permision For Rides In Margadarsi Head Office: హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలకు సంబంధించి విజయవాడ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఈ నెల 13న జారీ చేసిన వారంట్‌ను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటీషన్‌పై..జస్టిస్ ముమ్మనేని సుధీర్‌కుమార్ విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శి చందాదారుల పేర్లు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను అధికారులు అడిగారని, ఇది చందాదారుల వ్యక్తిగత సమాచారమే కాకుండా, మార్గదర్శికి చెందిన..మేధోసంపత్తి ఆస్తి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేసే ముందు..ఒక చిట్, లేదా చిట్ గ్రూపులో ఏదైనా అక్రమం..చట్ట ఉల్లంఘన ఉన్నాయని పేర్కొనలేదన్నారు.

చిట్‌ఫండ్‌ చట్టం సెక్షన్ 82 ప్రకారం చట్టానికి భిన్నంగా ఉన్నట్లు ఏదైనా అనుమానం ఉంటే రిజిస్ట్రార్ గానీ, ఆయన తరఫున అధీకృత వ్యక్తిగానీ..సోదాలు నిర్వహించి, అనుమానం ఉన్న పత్రాలు, పుస్తకాలు, రిజిస్టర్లు సీజ్ చేయడానికి రాతపూర్వకంగా కారణాలు తెలపాలని వివరించారు. కానీ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసులో..ఎలాంటి కారణాన్నీ పేర్కొనలేదన్నారు. హైదరాబాద్ కార్యాలయంలో వివరాలను రహస్యంగా ఉంచారనే..అనుమానంతో ప్రొసీడింగ్స్ జారీ చేశారన్నారు. ప్రాథమికంగా పరిశీలిస్తే..సోదాల కోసం వారంట్ జారీ చేయడానికి రాతపూర్వకంగా కారణాలు నమోదుచేయలేదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రధాన కార్యాలయంలో సోదాలకు అనుమతి లేదని చెప్పిన తెలంగాణ హైకోర్టు

ఈ పిటిషన్ ను విచారించే పరిధిపై న్యాయమూర్తి ప్రాథమికంగా సందేహం వ్యక్తం చేయగా..మార్గదర్శి తరపు న్యాయవాది ఎం.వి దుర్గాప్రసాద్ స్పందిస్తూ అధికరణ 228 క్లాజ్ 2 కింద తెలంగాణ హైకోర్టుకు విచారించే పరిధి ఉంటుందన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30, 33, 40 కింద..కోర్టు పరిధి లేదన్న ఏపీ తరపు న్యాయవాది పి. గోవింద రెడ్డి లేవనెత్తిన సెక్షన్లు..ఇక్కడ వర్తించవన్నారు.

వారంట్ గడువు శుక్రవారంతో ముగుస్తుందన్న ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాది వాదనపై..న్యాయమూర్తి స్పందిస్తూ స్పష్టత వచ్చే వరకు సోదాలు కొనసాగుతాయని రిజిస్ట్రార్ పేర్కొన్నందున, ఈ వాదనను అనుమతించలేమన్నారు. ఈ కారణాల నేపథ్యంలో..చందాదారుల వివరాలను వెల్లడించాలనడం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని..అందువల్ల వారంట్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు..జారీ చేస్తున్నామన్నారు.

మార్గదర్శి ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉన్నందున..ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ సోదాలు నిర్వహించే అధికారం లేదని మార్గదర్శి తరపు న్యాయవాది ఎం.వి దుర్గాప్రసాద్ వాదించారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోఉన్నందున..చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం తెలంగాణకే పరిధి ఉంటుందన్నారు. దాని శాఖలున్న..ఏపీకి కాదన్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న శాఖలపైనే వాటికి పరిధి ఉంటుందన్నారు. ఏపీలోని 17 బ్రాంచీల్లో సోదాలు నిర్వహించారని..ఒక్క శాఖలో కూడా లోపాలున్నట్లు చెప్పలేదన్నారు. అయినప్పటికీ..ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్లో లోపాలుంటాయన్న అనుమానంతో..ఇక్కడికి వచ్చారన్నారు. కార్పొరేట్ కార్యాలయంపై ఆరోపణలుంటే..విచారించే పరిధి తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొన్నారు.

మార్గదర్శి చిట్ ఫండ్..గత ఆరు దశాబ్దాలుగా మచ్చలేని వ్యాపారాన్ని నిర్వహిస్తోందన్నారు. 9,677 కోట్ల టర్నోవరు ఉందన్నారు. 108 బ్రాంచీల్లో 2.71 లక్షల మంది చందాదారులున్నారని, ఏపీ ప్రభుత్వం..దురుద్దేశాలతో, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా..సోదాలు నిర్వహిస్తోందని మార్గదర్శి తరపు న్యాయవాది ఎం.వి దుర్గాప్రసాద్ వివరించారు. 'చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 46 కింద 17 బ్రాంచీల్లో..తనిఖీలు నిర్వహించిందని..అలా నిర్వహించినపుడు పొరపాట్లు సంస్థ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత చట్టప్రకారం..అధికారులపై ఉందన్నారు.

ఏపీ అధికారులు ఒక్క లోపాన్ని కూడా బయట పెట్టలేకపోయారని..అలాంటప్పుడు ప్రధాన కార్యాలయంలో ఏదో ఉంటుందని అనుమానించడం..హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏదో ఒక వంక పెట్టుకుని, సంస్థ కార్యకలాపాలను స్తంభింపజేసి అప్రతిష్ఠ పాలేయాలన్న..దురుద్దేశం తప్ప, సోదాలకు ఎలాంటి కారణాలు లేవని.. మార్గదర్శి న్యాయవాది దుర్గాప్రసాద్ కోర్టుకు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2022, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details