పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన తేదేపా సీనియర్ నాయకుడు నాయుడు రామచంద్రరావు శుక్రవారం తుది శ్వాస విడిచారు. గణపవరం మండలం అగ్రహారం గోపవరంలోని తన స్వగృహంలో మరణించగా.. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడిగా, లేపాక్షి డైరెక్టర్గా పని చేసి, పార్టీ అభివృద్ధికి విశేష సేవలందించారని కొనియాడారు. 2018లో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా పని చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించి, కార్యకర్తగానే ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు.
తెదేపా సీనియర్ నేత నాయుడు రామచంద్రరావు కన్నుమూత
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపా అంటే రామచంద్ర రావు.. రామచంద్ర రావు అంటే తెదేపా అనే విధంగా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు రామచంద్ర రావు.. ఆయన శుక్రవారం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కార్యకర్తగా పార్టీ ఉన్నతికి నిస్వార్ధంగా పనిచేశారంటూ నేతలు ఆయన సేవలను కొనియాడారు.
తెదేపా సీనియర్ నేత నాయుడు రామచంద్రరావు మృతి