ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతమనేనిని మరో కోడెలలా చేయాలనుకుంటున్నారా? - వర్లరామయ్య

మరో కోడెల శివప్రసాద్​రావులా చేయాలన్న ఉద్దేశంతో చింతమనేని ప్రభాకర్​ను కేసుల పేరుతో మానసికంగా ప్రభుత్వం వేధిస్తోందని వర్ల రామయ్య ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

చింతమనేనిని పరామర్శించిన నేతలు

By

Published : Sep 27, 2019, 7:57 PM IST

చింతమనేనిని పరామర్శించిన నేతలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ను పలువురు తెదేపా నేతలు పరామర్శించారు. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రామయ్య, కొణతాల నారాయణరావు, ఇతర జిల్లా తెదేపా నాయకులు జైల్లో ఉన్న చింతమనేని కలిశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా తెదేపా నాయకులను అణచివేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. ముఖ్యమంత్రే పెద్ద ముద్దాయి అని.. మన దురదృష్టంకొద్దీ ఆయన మనకు ముఖ్యమంత్రి అయ్యారంటూ వర్ల రామయ్య ప్రభుత్వంపై తీవ్రస్థాయులో మండిపడ్డారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆయన ఆరోపించారు. తెదేపా నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వర్ల రామయ్య అన్నారు.

ABOUT THE AUTHOR

...view details