ఫ్లెక్సీ పంచాయితీ... అధికారులు, తెదేపా శ్రేణుల వాగ్వాదం - flexi
మున్సిపల్ అధికారులు, తెదేపా శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. తెదేపా కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
tdp-followers-municipal-officers-fighting
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెదేపా నేత ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారితీసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుచరులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగిస్తుండగా... తెదేపా కార్యకర్తలు, బుజ్జి అనుచరులు అడ్డుకున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, తెదేపా శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.