ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"సీఎం గారూ ఉన్నారా.. కేంద్ర మంత్రి చెప్పింది విన్నారా?"

పోలవరం టెండర్ల రద్దుపై మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరం టెండర్ల రద్దుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందని లోక్​సభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలపటంతో వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు కురిపిస్తోంది.

By

Published : Aug 2, 2019, 11:42 PM IST

Updated : Aug 3, 2019, 12:52 PM IST

తెదేపా

పోలవరం టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని.. నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్​సభలో తెలిపారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలే జగన్ చేతకానితనానికి రుజువుని అచ్చెన్నాయుడు అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రివర్స్ రూలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ పనితీరు ఉందని... ఏపీ ప్రయోజనాలు దెబ్బతీసి తెలంగాణకు లబ్ధి చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. పీపీఏలపై సమీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టిందని గుర్తు చేశారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఏమన్నారంటే...

లోక్​శ్ ట్వీట్

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై నారా లోకేశ్ కూడా స్పందించారు. సీఎం జగన్​ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి చెప్పింది విన్నారా... అని సీఎంను ప్రశ్నించారు. "పోలవరం ఆలస్యంతోపాటు ఖర్చు పెరుగుతుందని కేంద్రమంత్రి లోక్‌సభలో చెప్పారు. పోలవరం నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కేంద్ర వ్యవస్థల ఆమోదం తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమైంది" అని లోక్​శ్ ట్విటర్​లో విమర్శించారు.

లోక్​శ్ ట్వీట్

సంబంధిత కథనం

'పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం'

Last Updated : Aug 3, 2019, 12:52 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details