ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత - tdp chintamaneni prabhakar

రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరతను నిరసిస్తూ తెదేపా ఆందోళనకు దిగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుకపై కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న సమచారంతో.... పోలీసులు ఇంటి వద్ద భారీగా మోహరించారు.

చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత

By

Published : Aug 30, 2019, 3:49 PM IST

Updated : Aug 30, 2019, 4:18 PM IST

చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న సమచారంతో.... పోలీసులు ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఆయన బయటికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రభాకర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. గురువారం పెదవేగి మండలంలో జరిగిన ఇసుక వివాదానికి సంబంధించి పోలీసులు ఈ కేసులోనూ ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బయటకు వస్తే ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్‌ చేసి... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Aug 30, 2019, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details