చింతమనేని ఒక రౌడీషీటర్ అని... అటువంటి వ్యక్తికి చంద్రబాబు మద్దతు ఇవ్వటం ఏంటని... తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. 48 కేసులున్న... చింతమనేని అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్వో వనజాక్షిని కొట్టటంతో పాటు మీడియా వారిపై చింతమనేని దాడి చేశారని ఆరోపించారు. అటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవటం మానేసి... ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించారని కారుమూరి ఆరోపించారు. సీఎం జగన్ మాత్రం... తప్పు చేసింది ఎమ్మెల్యే అయినా సహించరని పేర్కొన్నారు.
తణుకు ఎమ్మెల్యే, మాజీఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
చింతమనేని ప్రభాకర్ విషయంలో తణుకు ఎమ్మెల్యే, మాజీఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం సాగింది. చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించడాన్ని... వైకాపా ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు తప్పుబట్టారు. అక్రమ కేసులపై పోరాడుతున్న వ్యక్తిని... ఆదర్శంగా తీసుకుంటే తప్పేముందని మాజీఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు.
కారుమూరి వ్యాఖ్యలపై తణుకు మాజీఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పందించారు. వైకాపా ప్రభుత్వం చింతమనేనిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపింందని ఆరోపించారు. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఎవరైతే చింతమనేనిపై కేసులు పెట్టారో... అక్కడికి కమిటీని పంపి విచారిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. ఓ ప్రభుత్వ అధికారినిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేస్తే... చిన్న కేసు పెట్టి వదిలేశారని అన్నారు. వాస్తవాలను గ్రహించుకొని ముందుకు సాగాలని ఆరిమిల్లి హితవు పలికారు.
TAGGED:
chintamaneni latest news