పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరువద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో అధికారులు పట్టుకున్న 4 కోట్ల 91 లక్షల నగదును పూచీకత్తుపై విడిచిపెట్టారు. వాహన తనిఖీల్లో భాగంగా ఎస్.ఎస్.టీ బృందం వాహనాన్ని ఆపి అందులో తీసుకెళ్తున్న నగదుకు సంబంధించి వివరాలు ఆరా తీశారు. యాక్సిస్ బ్యాంకుకు చెందిన మూడు శాఖలకు చెందిన నగదును కాకినాడ నుంచి విజయవాడ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యాక్సిస్ బ్యాంకు శాఖ మేనేజరు వచ్చి డబ్బుకు సంబంధించిన పత్రాలను పోలీసులకు చూపించారు. ఐటీ అధికారులు వచ్చి వాటిని పరిశీలించి బ్యాంకు నగదుగా నిర్ధరించారు. మేనేజరు పూచీకత్తుపై వాహనంతోపాటు నగదును వదిలిపెట్టారు.
పూచీకత్తుపై పట్టుకున్న నగదు విడుదల - తనిఖీ
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో అధికారులు పట్టుకున్న 4 కోట్ల 91 లక్షల నగదును పూచీకత్తుపై విడిచిపెట్టారు. యాక్సిస్ బ్యాంకుకు చెందిన మూడు శాఖలకు చెందిన నగదును కాకినాడ నుంచి విజయవాడ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల తనిఖీలు