పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు మైత్రి కంకణాలు తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓగిరాల అమూల్య.. కంకణాలు తయారుచేయడంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆసక్తిగా నేర్చుకున్న విద్యార్థులు.. కంకణాలపై వివిధ రకాల విత్తనాలను పేర్చారు. వీటిని భూమిలో నాటితే మొలకలు వచ్చి చెట్లు పెరుగుతాయని... అలా వచ్చిన విత్తనాలను మళ్లీ కంకణాలు తయారుచేసేందుకు ఉపయోగించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ బ్యాండ్లతో పర్యావరణ కాలుష్యం అవుతుందని... అందుకే విద్యార్థులతో వీటిని తయారు చేయించామని ప్రధానోపాధ్యాయురాలు చెప్పారు.
ఆ విద్యార్థులు మైత్రి కంకణాలు తయారుచేయటంలో దిట్ట - denduluru
అక్కిరెడ్డిగూడెం పాఠశాల విద్యార్థులు... మైత్రి కంకణాలు చేయటంలో ఎంతో ప్రావీణ్యం పొందారు. వీటిని తయారు చేయటంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పిల్లలకు శిక్షణ ఇచ్చారు.
మైత్రి కంకణాలు