ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీటు లెక్కేకాదు ఫలితమే ముఖ్యం' - MLa

జిల్లాలో నాయకులందరూ సమష్టిగా కష్టపడి పార్టీ విజయానికి కృషి చేస్తామని పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించే బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

తోట సీతారామలక్ష్మి

By

Published : Mar 10, 2019, 10:04 AM IST

తోట సీతారామలక్ష్మి
జిల్లాలో నాయకులందరూ సమష్టిగా కష్టపడి పార్టీ విజయానికి కృషి చేస్తామని పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. నరసాపురం ఎంపీగా తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఏనాడు పదవులు కోరుకోలేదని... జిల్లా అధ్యక్షురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా చంద్రబాబు నియమిస్తేనే చేస్తున్నానని తేల్చి చెప్పారు.జడ్పీ ఛైర్మన్​ ముళ్లపూడి బాపిరాజుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంపై తోట సీతారామలక్ష్మి స్పందించారు. పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేశారని... ఆ సీటు ఆశించడంలో తప్పులేదన్నారు. చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించే బాధ్యత అందరిపైనా ఉందన్నారు.నిడదవోలు, పోలవరం, చింతలపూడి, కొవ్వూరు నియోజవర్గం అభ్యర్థులు తేలాల్సి ఉందని... రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటిస్తారని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details