ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యవతిని వేధిస్తున్న యువకునికి స్థానికుల దేహశుద్ది - west godavari

భీమవరంలో మత్తు మందు కలిపిన పానీయం తాగించి.. వీడియో చిత్రీకరించి లైంగికంగా వైధిస్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ది చేశారు.

యవతిని వేధిస్తున్న యువకునికి స్థానికుల దేహశుద్ది

By

Published : Apr 24, 2019, 3:55 AM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సుంకర బద్దయ్య వీధిలో నివాసముండే యువతిని వేధిస్తున్న డేగల రాంబాబు అనే వ్యక్తికి స్థానికులు దేహశుద్ది చేశారు.
నరసాపురం మండలం ఎల్ బీ చర్ల ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాంబాబుకు... భీమవరానికి చెందిన యువతి మధ్య పరిచయం ఏర్పడింది. యువతికి మాయ మాటలు చెప్పి.. ఇంటికి తీసుకెళ్లి పానీయంలో మత్తు మందు కలిపి తాగించాడు. తర్వాత ఆమెపై అత్యాచారం చేసి , వీడియో తీసి బెదిరిస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాంబాబును స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details