ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకోడేరులో  శ్రీ నవకుండాత్మక శత చండీయాగం

సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న కునాదిరాజు వెంకటసత్య తమ్మి రాజు, వెంకట కృష్ణంరాజు సోదరులు అభినందనీయులని నరసాపురం ఎంపీ కొనియాడారు. పాలకోడేరులోని పోలేరమ్మ ఆలయ ప్రాంగణంలో 'జగత్ కళ్యాణం' కోసం నిర్వహిస్తున్న శ్రీ నవ కుండాత్మక శత చండీయాగంలో ఆయన పాల్గొన్నారు.

Shri Navakundathaka Satha Chandiyagam in pakoderu
పాలకోడేరులో శ్రీ నవకుండాత్మక శత చండీయాగం

By

Published : Jan 17, 2020, 5:30 PM IST

పాలకోడేరులో శ్రీ నవకుండాత్మక శత చండీయాగం

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులోని పోలేరమ్మ ఆలయ ప్రాంగణంలో 'జగత్ కళ్యాణం' కోసం నిర్వహిస్తున్న శ్రీ నవకుండాత్మక శత చండీయాగంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కునాదిరాజు వెంకటసత్య తమ్మి రాజు, వెంకట కృష్ణంరాజు సోదరులను కొనియాడారు. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారు. అక్కడే ఉన్న కేరళ డప్పు కళాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సుమారు 20 లక్షల వ్యయంతో మూడు రోజులపాటు శ్రీ నవకుండాత్మక శత చండీయాగం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చండీయాగానికి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details