ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"నా కొడుకును చంపేసి... ఆత్మహత్య అంటున్నారు" - son dead

"నా కొడుకును హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించారు. చేతులన్నీ కోసేసి.. దారుణంగా చంపి... ఉరేశారు. ఫోన్​లో మెస్సెజ్​లు కూడా ఉన్నాయి. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదు. రెండేళ్ల నుంచీ పోరాడుతూనే ఉన్నా.. కానీ న్యాయం జరగడం లేదు." అంటూ ఓ తల్లి కన్నీటి పర్యంతం అవుతోంది. "నా కొడుకును ఎలాగూ తీసుకురాలేరు.. కనీసం వాడి ఆత్మకు శాంతైనా కలిగించండి" అని వేడుకుంటోంది.

వంశీ తల్లిదండ్రులు

By

Published : Jul 24, 2019, 2:52 AM IST

Updated : Jul 24, 2019, 4:53 AM IST

వంశీ తల్లి ఆవేదన
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి బడుగు వంశీ 2017లో మృతి చెందాడు. అయితే తమ కుమారుడిది ఆత్మహత్య కాదని.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అతని తల్లి ఆరోపిస్తోంది. ఓ వివాదానికి సంబంధించి తమపై కక్ష పెంచుకున్న స్థానికులు... వంశీని చంపేశారని అంటోంది. కుమారుడు చనిపోయి రెండేళ్లు అవుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. హత్యకు సంబంధించిన వీడియోలు... పోలీసుల దగ్గర ఉన్న సెల్​ఫోన్​లో ఉన్నాయని తెలిపింది. వీటి ఆధారంగా తమ కుమారుడి మృతికి కారకులైన వారిని శిక్షించాలని కోరింది. కలెక్టర్, ఎస్పీ.. ఇలా ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా న్యాయం జరగలేదని వాపోతోంది.

ఈ కేసు దర్యాప్తులో ఉందని వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయని పెదవేగి ఎస్సై మోహన్ రావు తెలిపారు.

Last Updated : Jul 24, 2019, 4:53 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details