SAVE THE GIRL CHILD: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆడపిల్లను కాపాడదామంటూ.. 2కే రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ బాలికను భూజాలపై మోస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో మహిళలు, విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భ్రూణ హత్యలు నిర్మూలిద్దాం-స్త్రీ జాతిని సమున్నతం చేద్దాం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల - ANDHRA NEWS
SAVE THE GIRL CHILD: ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద.. ఆ సంపదను కాపాడుకుందాం అంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. అవకాశాలు కల్పిస్తే అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తారని చెప్పారు.
2కే రన్
"ప్రతీ ఇంటిలో కూడా ఆడపిల్ల అమ్మకు ఎంతో సాయంగా ఉంటుంది. తండ్రికి ఎంతో స్నేహంగా, అన్న తమ్ముల్లకు ఆసరాగా ఉంటుంది. అటువంటి ఆడపిల్లను సమాజంలో కొంత మంది తక్కువగా చూస్తున్నారు. అటువంటి పరిస్థితి మారాలి. అమ్మాయిలు కూడా అద్భుతంగా రాణిస్తారని చెప్పేందుకే ఈ 2కే రన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తున్నాం" - నిమ్మల రామానాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే
ఇవీ చదవండి: