ROUND TABLE MEETING: 'అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలి' - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
ROUND TABLE MEETING: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా కొనసాగాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
ROUND TABLE MEETING: ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు అభిప్రాయపడ్డాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమరావతి ఆవశ్యకతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నేతలు పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణను రూపొందించనున్నట్లు ఐకాస వెల్లడించింది.