ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు వ్యర్థాల డంపింగ్‌పై రెండో రోజూ ప్రజాభిప్రాయ సేకరణ

పోలవరం ప్రాజెక్టు వ్యర్థాల డంపింగ్‌పై.. ఎన్జీటీ సంయుక్త నిపుణుల కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. పోలవరం ఉన్నత పాఠశాల ఆవరణలో కార్యక్రమం జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మూలలంక గ్రామస్థులు తెలిపారు. గాలిలో దుమ్ము పేరుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్య వస్తోందని...కమిటీ సభ్యులకు వివరించారు.

By

Published : Mar 31, 2021, 12:57 PM IST

Referendum on Polavaram project waste dumping
Referendum on Polavaram project waste dumping

పోలవరం ప్రాజెక్టు వ్యర్థాల డంపింగ్‌పై.. ఎన్జీటీ సంయుక్త నిపుణుల కమిటీ రెండోరోజూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. పోలవరం ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరిస్తోంది. మూలలంకలో ఎలాంటి హానీ ఉందన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. గాలిలో దుమ్ము పేరుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్య వస్తోందని విచారం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో బురద వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమిటీకి వెల్లడించారు. పోలవరంలో రెండ్రోజులుగా సంయుక్త నిపుణుల కమిటీ పర్యటిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాల వల్ల పర్యావరణానికి, ప్రజలకు తీవ్ర హాని కలుగుతుందని పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆరుగురితో కూడిన సంయుక్త కమిటీని నియమించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న విషయాలపై ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. ఏప్రిల్ 2న రాజమహేంద్రవరంలో ఈ నివేదికను మీడియా ముందు వెల్లడించే అవకాశం.

ఇదీ చదవండి: పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన

ABOUT THE AUTHOR

...view details