ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 24, 2020, 7:54 PM IST

Updated : Jun 24, 2020, 9:24 PM IST

ETV Bharat / state

భారీగా నమోదవుతున్న కేసులు... తీవ్రమవుతున్న రెడ్​జోన్ వాసుల కష్టాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు.. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. అయితే రెడ్​జోన్లలోని ప్రజలకు అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సరైన సౌకర్యాలులేక.. రెడ్ జోన్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

red zone people problems in east godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్​జోన్ వాసుల కష్టాలు

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రెండున్నర నెలల వ్యవధిలో వంద లోపు ఉన్న కేసులు.. 18రోజుల్లోనే ఆరువందలకు చేరుకున్నాయి. పాజిటివ్ కేసులు విస్తరణతో రెడ్ జోన్ల సంఖ్య కూడా అధికమవుతోంది. ఇదిలా ఉండగా రెడ్​జోన్లలో ఉండే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదు. నిత్యావసరాలు, తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, కూలీ పనిచేసుకునే వారు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదని వాపోతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్​జోన్ వాసుల కష్టాలు

28 రోజుల వరకు ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదుకాకపోతే.. ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్ నుంచి మినహాయిస్తున్నారు. నెలరోజులుగా పదుల సంఖ్యలో కేసులు ఈ రెడ్ జోన్ ప్రాంతాలలోనే వెలుగుచూస్తున్నాయి. ఏలూరు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, పోడూరు, కొవ్వూరు, పెదపాడు, ఉండి ప్రాంతాల్లో రెడ్ జోన్లు అధికంగా ఉన్నాయి. జిల్లాలో నమోదైన కేసుల్లో కేవలం ఏలూరు లోనే 262పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా ఏలూరు నగరంలో పూర్తి లాక్​డౌన్ విధించారు.

ఇదీచదవండి.

పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు

Last Updated : Jun 24, 2020, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details