ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ

మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా నరసాపురంలో వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని ర్యాలీ అనంతరం మంత్రి శ్రీ రంగనాథరాజు మీడియాకు వెల్లడించారు.

Rally held in narasapuram in support of the three capitals
Rally held in narasapuram in support of the three capitals

By

Published : Jan 11, 2020, 12:03 AM IST

మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వైకాపా శ్రేణులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి పట్టణ వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి అభివృద్ధి పనులను అసంపూర్తిగా నిలిపివేశారన్నారు. లక్షా అయిదు వేల కోట్లతో రాజధాని అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు రూ. 5 వేల కోట్లతో తాత్కాలిక పనులు చేపట్టి నిలిపివేశారని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు ఆక్వా ల్యాబ్, తాగునీరు ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారన్నారు. రాయలసీమ జిల్లాలకు గోదావరి జలాలు అందించడం తదితర అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టారన్నారు. తూర్పు గోదావరి జిల్లాను టూరిజంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సీఎం చర్యలు చేపట్టనున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details