అన్నదాతలు పండించిన పంటకు మద్దతుధర దక్కడం... దళారీల బెడద నుంచి రైతులను రక్షించడం ధాన్యం కొనుగోలు కేంద్రాల కర్తవ్యం. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు ఇందుకు భిన్నంగా ఉంది. రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 294 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కచోట కూడా ధాన్యం కొన్న పరిస్థితి కనిపించడం లేదు. రికార్డుల్లో మాత్రం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలు సహకారం అందించనందున రైతులు తమ పంటను దళారీలకు అమ్ముకుంటున్నారు. అధిక తేమ శాతం, తరగు అంటు.. వ్యాపారులు రైతును దగా చేస్తున్నారు. మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసి.. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి తీసుకొన్నట్లు నమోదు చేస్తున్నారు.
మద్ధతు ధరకు చిల్లు