ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంపై.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైకాపా ఆధ్వర్యంలో లబ్ధిదారులు ధర్నా చేశారు. ఇందుకు తెలుగుదేశం పార్టీయే కారణమంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు కాక, డీ ఫారం పట్టాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పట్టాల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
తణుకులో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఆందోళన - concern in thanuku
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైకాపా ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులు ఆందోళన చేశారు. తమకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
తణుకులో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఆందోళన