ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా ఎంపీని పార్లమెంట్​ నుంచి బర్తరఫ్ చేయండి' - ఎంపీ రఘురామ తాజా వార్తలు

రఘురామకృష్ణరాజును ఎంపీగా పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. రఘురామ ఇప్పటివరకు నియోజకవర్గంలో పర్యటించలేదని ఆరోపిస్తూ..ఆయనకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో నేతలు నిరసన వ్యక్తం చేశారు.

protest against mp raghurama at palakoderu
మా ఎంపీ కనిపించటం లేదు..పార్లమెంటు నుంచి భర్తరఫ్ చేయండి

By

Published : Jun 13, 2021, 5:04 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి దిల్లీ, హైదరాబాద్​లో ఉంటున్నారు తప్ప..నియోజకవర్గంలో కనిపించటం లేదని మండిపడ్డారు. తాము ఓట్లేసి గెలిపిస్తే..ఎంపీగా ఒక్క ఎస్సీ కాలనీని కూడా ఇప్పటివరకు సందర్శించలేదని ఆందోళన చేపట్టారు.

రఘురామకృష్ణరాజును ఎంపీగా పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలని పాలకోడేరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details