ఆచంటలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక.. 'ఉపాధి'పై సమీక్ష - achanta
ఆచంటలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నిధులపై జరిగిన పనులపై సమీక్షించారు. సుమారు లక్ష రూపాయల వరకూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
'ఆచంటలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక'
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు మండలంలో గత ఏడాదిలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో జరిగిన పనులపై నివేదికలను వెల్లడించారు. మొత్తం 1887 పనులు పూర్తి చేయగా... సుమారు 3 కోట్ల 5 లక్షల రూపాయల నిధులు వినియోగించినట్లు వెల్లడించారు. సుమారు లక్ష రూపాయల వరకు అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.