ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంక్షలు అతిక్రమించిన వారిపై.. కఠిన చర్యలు

కరోనా కేసుల నివారణకు అమలుచేస్తున్న కర్ఫ్యూ​ను అతిక్రమిస్తున్న వారిపై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు కూడా ఇందులో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

police strictly implementing curfew
కర్ఫ్యూ వేళల్లో రోడ్డుపైకి వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు

By

Published : May 12, 2021, 8:11 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సీఐ మల్లేశ్వరరావు కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా రహదారిపై తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ఎక్కువ మంది యువకులు రహదారిపైకి రావడంతో.. వారి ద్విచక్ర వాహనాలను స్టేషన్​కు తరలించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కరోనాను అరికట్టేందుకు అహర్నిశలూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details