Police Raid Bethapudi Yuvagalam Camp Site: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రను అడ్డుకునేందుకు ఓవైపు అధికార పాార్టీ శ్రేణులు అడుగడుగునా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా.. మరోవైపు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్‌పై.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మూడు వ్యాన్లలో యువగళం క్యాంప్ సైట్‌కి చేరుకున్న పోలీసులు.. మొత్తం 50మంది యువగళం వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది, క్యాంప్ ఏర్పాటు చేసే సిబ్బందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆ 50 మందిని ఏ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా వాహనాల్లోనే గంటల తరబడి తిప్పడంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్రంగా ఆగ్రహిం వ్యక్తం చేసింది. చివరకు పోలీసులు బుధవారం రాత్రి వివిధ కోర్టుల్లో హాజరుపరిచారు. ఈ ఘటనలో 14 మంది నాయకులు, 38 మంది వాలంటీర్లపై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. చింతమనేని, తోట సీతారామలక్ష్మి సహా 14 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కొంతమందిని భీమవరం కోర్టులో హాజరుపరిచిన అనంతరం.. మళ్లీ పీఎస్‌కు తీసుకెళ్లి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర అడ్డుకోవడం వల్ల పోలీసులు, వారి మధ్య వాగ్వాదం జరిగింది.
Police Arrested 50 Yuvagalam Volunteers:టీడీపీ యువనేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుమతులిచ్చిన అధికారులు.. ఆంక్షలు, అటంకాలు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. బేతపూడిలో లోకేశ్ పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన యువగళం క్యాంప్ సైట్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడి చేశారు. మొత్తం మూడు వ్యాన్లలో యువగళం క్యాంప్ సైట్‌కి వచ్చిన పోలీసులు.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 50 మంది యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ 50 మందిని ఏ స్టేషన్‌కు తరలించకుండా వాహనాల్లోనే.. కైకలూరు, కలిదిండి మార్గాల్లో రోడ్లపై తిప్పారు. ఆ తర్వాత సీసలిలోని ఐస్ ప్లాంట్‌లోకి వాలంటీర్లను తరలించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను నిరసిస్తూ.. కలిదిండి పోలీస్ స్టేషన్‌కి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరోవైపు గత రాత్రి నారా లోకేశ్ పాదయాత్రపై పక్కాగా కాపుకాచి వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు. దాడిలో పోలీసులతో పాటు తెలుగుదేశం నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలోనే యువగళం వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Nara Lokesh 200 days Yuvagalam Padayatra: 200 రోజుల ప్రయాణం.. అడుగడుగునా వెల్లివిరిసిన అభిమానం