ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాఫిక్ పోలీసుల అదుపులో 55 మంది మైనర్లు - case

ఏలూరు ట్రాఫిక్ పోలీసులు నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి 55 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

ట్రాఫిక్ పోలీసుల అదుపులో 55 మంది మైనర్లు

By

Published : Apr 24, 2019, 3:53 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 55 మంది మైనర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులకు... ట్రాఫిక్ డీఎస్పీ పీ. భాస్కర్ రావు కౌన్సెలింగ్ నిర్వహించారు. చిన్న పిల్లలకు మోటర్ సైకిల్ ఇవ్వకూడదని తెలిపారు. వారికి బైక్ ఇవ్వటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలానే చేస్తే తల్లిదండ్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని... కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details