కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ నిబంధనలు పాటించని వారికి పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్‌పై వెళ్తున్న 15 మందిని పోలీసులు అడ్డుకున్నారు. తామంతా కుటుంబాలు వదిలి విధులు నిర్వహిస్తున్నామని.. అయినా ప్రజల్లో మార్పు లేదని.. సీఐ రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక వారి చేతికి చీపుర్లు ఇచ్చి.. రహదారిని ఊడ్పించారు. అనంతరం వారికి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా.. రహదారులపైకి వచ్చి.. ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని పోలీసులు హితవు పలికారు.
చెప్తే వినకుంటే... ఇలా రోడ్లు ఊడిపిస్తారు మరీ..!
కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. లాక్డౌన్ పాటించండి అంటూ.. ప్రభుత్వం ఎంత మెుత్తుకున్నా.. కొంతమందికి చెవికి ఎక్కడం లేదు. ఎన్ని విధాలుగా చెప్పిన వినకపోవడంతో.. బయటకు వచ్చిన వారితో రోడ్లు ఊడిపించేశారు పోలీసులు.
చెప్తే వినకుంటే.. ఇలా రోడ్లు ఊడిపిస్తారు మరీ!