ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతరాష్ట్ర దొంగ... బాహు భాషా కోవిదుడు

ఎదుటివారిని మోసగించడమే తన వృత్తిగా పెట్టుకున్నాడతను. ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఈ దొంగ..అలవోకగా అమాయకులను మోసం చేస్తాడు. పలు రాష్ట్రాల్లో ఇతనిపై కేసులున్నప్పటీకీ బెయిల్ పై తిరిగొచ్చి మళ్లీ వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఎట్టకేలకు పోలీసులు పక్కా సమాచారంతో ఈ దొంగను పట్టుకున్నారు.

By

Published : Nov 13, 2019, 3:17 PM IST

అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులు

ఈ అంతరాష్ట్రదొంగ ...బాహుభాషా కోవిదుడు

వరుసగా మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్ కుమార్ తండ్రి నరసింహారెడ్డి గ్రానైట్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలోని మెలకువలు నేర్చుకుని.. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ సాయి గ్రానైట్ అండ్ ఎక్స్​పోర్ట్​ పేరుతో పలు రాష్ట్రాల వ్యాపారులతో గ్రానైట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. సరకు పంపిస్తున్నానని.. గతంలో లారీలో లోడ్ చేసిన గ్రానైట్ ఫోటోలను వ్యాపారులకు పంపించి తన బ్యాంకులో సొమ్ములు జమ చేయించుకున్నాడు. వ్యాపారులతో అజిత్ కుమార్ డ్రైవర్​ని అంటూ మరో నిందితుడు నెక్కలపు ఆకాష్ మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా పలురాష్ట్రాల వ్యక్తులను మోసం చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులని అరెస్ట్ చేశారు. బెయిల్​పై బయటకు వచ్చి అజిత్ పలు నేరాలు చేశాడు. ఇతను ఆరు భాషల్లో మాట్లాడగలడు. ఇతనిపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. వారి వద్ద నుంచి 55 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.1 లక్షా 60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details