ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం వద్ద గోదావరి పరవళ్లు - westgodavari

పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.

గోదావరి

By

Published : Sep 7, 2019, 11:40 PM IST

పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి

తెలంగాణలోని భద్రాచలం వద్ద 42 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకున్న పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పరిసర ప్రాంతాల్లో ప్రవాహం పెరిగింది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 23 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంది. గ్రావిటీ ద్వారా ప్రవాహం స్పిల్ ఛానెల్​కు చేరుకుంటోంది. వరదనీటిలో కొత్తూరు కాజ్​వే మునిగిపోయింది. సుమారు 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపు ముప్పుతో గజగజలాడుతున్నాయి. మరో రెండు రోజులు వరద ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details