జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు భీమవరం తహశీల్దార్ కార్యాలయంలో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉదయమే భీమవరం చేరుకొన్న పవన్ కళ్యాణ్... నిర్మలాదేవి కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం భారీ అభిమాన జన సందోహం మధ్య కళ్యాణ మండపం నుంచి రోడ్డుషో ద్వారా భీమవరం చేరుకొన్నారు. పవన్ నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భీమవరం పట్టణం వీధులు జనసంద్రంగా మారాయి.