ప్రభుత్వ స్ధలాలలో ఆక్రమణల తొలగింపు - అక్రమ నిర్మాణాలు
ఉండ్రాజవరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు కలెక్టరుకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలోని ప్రభుత్వ స్ధలంలో అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు తొలగించారు. ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉన్న కారణంగా... అక్కడి మాజీ సర్పంచ్ భర్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆగ్రహించిన స్థానికులు కలెక్టరుకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పంచాయితీ అధికారులు స్థలాన్ని సర్వే చేయించి, ట్యాంకు పోరంబోకు భూమిగా నిర్ధరించారు. ఇంటి తొలగింపులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండ్రాజవరం మండల రెవెన్యూ అధికారులతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం పోలీస్ సర్కిళ్ళ పరిధిలోని పోలీసు సిబ్బందిని మొహరింపజేశారు.