పశ్చిమగోదావరి జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తణుకు మండలం మండపాకలో ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో కలశ స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా.. ఆలయ అధికారులు... భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వర్ణాభరణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉండ్రాజవరంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన కాషాయ పతాకాలతో.. అమ్మవారి ప్రతిరూపాలైన గరగ, కలశాలను గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ... మహిళా భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం - శరన్నవరాత్రి ఉత్సవాలు
శరన్నవరాత్రి ఉత్సవాలు పశ్చిమగోదావరి జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మండపాక ఎల్లారమ్మ ఆలయంలో కలశ స్థాపన చేశారు. ఈ రోజు స్వర్ణాభరణ అలంకారంలో పాలంగి శ్రీ కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉండ్రాజవరంలోని ముత్యాలమ్మ అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు.
navaratri-utsav