ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోళ్ల పందేలు... ఎడ్ల పోటీలను కాపాడుకుందాం: ఎంపీ - ఏపీలో కోళ్ల పందేలు

కోళ్ల పందేలు, ఎడ్ల పోటీలు మన సంస్కృతి, సంప్రదాయాలని ఎంపీ రఘరామకృష్ణం రాజు అన్నారు. పశు సంపద వృద్ధికి ఈ పందేలు ఉపయోగపడతాయని అన్నారు. ఒక్క రోజు వాటిని ఇబ్బంది పెట్టినా సంవత్సరమంతా ప్రేమగా చూసుకుంటామని వెల్లడించారు.

narasapuram mp raghurama krishnam raju comments on cock fights
narasapuram mp raghurama krishnam raju comments on cock fights

By

Published : Jan 12, 2020, 11:11 PM IST

కోళ్ల పందేలు సంప్రదాయంలో భాగమన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు

పల్లెలు రాష్ట్రాభివృద్ధికి పట్టుకొమ్మలని..... అందుకే ముఖ్యమంత్రి వాటి అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణమరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో రెండు కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. భవిష్యత్​లో పల్లెల అభివృద్ధిని చూసి యువత పట్టణాల నుంచి వెనక్కి తిరిగివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు, ఎడ్ల పోటీలు అని... ఇవి మన సంస్కృతి, సంప్రదాయాలని అన్నారు. వాటిని మనం పరిరక్షించుకోవాలని కోరారు. కోళ్ల పందాలు జరగటం వల్ల జాతి పుంజులను అభివృద్ధి చేస్తామని అన్నారు. లేకపోతే వాటిని కూడా తినేస్తామని వివరించారు. ఒక్క రోజు వాటిని ఇబ్బంది పెట్టినప్పటికీ... సంవత్సరమంతా ప్రేమగా చూసుకుంటామని వెల్లడించారు. అందుకే కోళ్ల పందాలు, ఎడ్ల పోటీలను మన పూర్వీకులు అలవాటు చేశారని ఎంపీ వెల్లడించారు. వీటిని నాశనం చేయడానికి కొన్ని సంస్థలు వస్తాయని... వాటిని పట్టించుకోనవసరం లేదని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details