నాయకుడు చనిపోయినా గుర్తు పెట్టుకోవాలంటే ప్రజలు మెచ్చిన పనులు చేయాలని నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 50 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారని పేర్కొన్నారు. 'అమ్మ ఒడి' పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే కాకుండా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్కు కూడా విస్తరించడం విశేషమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీకి నామరూపాలు లేకుండా చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని ప్రజలకు తెలిపారు.
'స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షమే లేకుండా చేయాలి' - speech
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిధిలో వివిధ అభివృద్ధి పనులను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు.
'రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా చేయాలి'
తణుకు మండలం కొమరవరంలో 66 మంది లబ్ధిదారులకు నివాసముంటున్న ఇంటికి ధ్రువ పత్రాలు అందజేశారు. తణుకు పట్టణంలో నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.