పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 233 జీవోను అమలు చేయాలని, 13 రోజుల సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఇంక్రిమెంట్లు వెంటనే వేయాలని, బకాయి వేతనాలు విడుదల చేయాలని, జీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇచ్చిన హామీలు మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
'233 జీవోను అమలు చేసి.. వేతన బకాయిలు చెల్లించండి' - తణుకులో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా న్యూస్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. 233 జీవోను అమలు చేయాలని, 13 రోజుల సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
municipal workers dharna in tanuku
TAGGED:
233 jo latest news in telugu