ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవేందర్‌రెడ్డిని డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని.. ఆయన పనేదో ఆయన చేసుకోవాలని, తనపై కామెంట్లు చేయడమేంటని ప్రశ్నించారు. ఒక ఎంపీపై ప్రభుత్వ ఉద్యోగి నీఛమైన కామెంట్లు చేస్తుంటే... కనీసం పిలిచి మందలించరా అని నిలదీశారు.
ఈ విషయంపై సీఎం జగన్ స్పందించకుంటే పార్లమెంటులో, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. అతన్ని 48 గంటల్లో విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలున్న ఓ కులాన్ని తిరస్కరించే స్థాయికి దిగజార్చుతున్నారని పేర్కొన్నారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో తనపై గుర్రంపాటి చేసిన విమర్శలను రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు.