కరోనాతో ప్రస్తుతం విపత్కర పరిస్థితి నెలకొందన్నారు మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ. స్వీయ నిర్బంధంలో ఉండి లాక్‌డౌన్ పాటిస్తున్న ప్రజలందరికీ ప్రభుత్వం సహాయం చేస్తోందని చెప్పారు. పరిస్థితి బాగోలేకున్నా వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగం దెబ్బతింటున్న పరిస్థితుల్లో గ్రామాల ప్రజలు కట్టుబాట్లు సడలించుకోవాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యవసాయ కూలీలను గ్రామ పెద్దలు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల సహకారం లేక ఆక్వా సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆక్వా సాగు వద్దని హితవు పలికారు. చైనాకు ఎగుమతులు ప్రారంభమయ్యాయని... ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.
ఆక్వా సాగు ఇప్పుడొద్దు: రైతులకు మంత్రి మోపిదేవి విజ్ఞప్తి - ఏపీలో ఆక్వాపై లాక్‌డౌన్ ప్రభావం
కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకుంటామని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. కరోనా ప్రభావంతో.. గ్రామాల్లోని ప్రజల కట్టుబాట్ల వల్ల ఆక్వా రంగం దెబ్బతింటుందన్న మంత్రి... వాటిని సడలించాలని కోరారు. ఒంటిగంట వరకూ వ్యవసాయ కూలీలను అనుమతించాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తుల సహకారంలేక రైతులు నష్టపోతున్నారన్న మంత్రి... అనుకూల వాతావరణం లేనందున ఆక్వాసాగు వద్దని హితవు పలికారు.
మంత్రి మోపిదేవి వెంకట రమణ