దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు. దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు , ఉపాధ్యాయ - ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రం పట్ల భాజపా మెుండివైఖరి వహిస్తుందని, ప్రతిపక్ష నేత జగన్ భాజపాకు వంత పాడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాలలో చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.